మంత్రి తలసానికి కొండపోచమ్మ నివేదిక


Fri,July 19, 2019 02:30 AM

జగదేవ్‌పూర్: కొండ పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి కావాల్సిన స్థలం, అక్కడ ఉన్న భవనాలతో పాటు పలు వివరాలతో కూడిన నివేదికను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూం రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంత్రి తలసానిని గురువారం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, తీగుల్‌నర్సాపూర్ సర్పంచ్ రజితరమేశ్, కొండపోచమ్మ దేవాలయ కమిటీ తాజా మాజీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గుం డారంగారెడ్డి, దేవాదాయశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల రోజుల క్రితం కొండపోచమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని, భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని సొంతం నిధులతో పెద్దగా పునర్నిర్మించాలని నిర్ణయించగా, మంత్రి ఆదేశాల మేరకు ఆలయ చరిత్ర, అక్కడ ఉన్న భవనాలు, ఆలయ నిర్మాణానికి కావాల్సిన స్థలంతో పాటు పలు వివరాలతో కూడిన నివేదికను మంత్రికి అందించారు. కార్యక్రమంలో నాయకుడు సంతోష్‌రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్‌కుమార్ తదితరులున్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...