గ్రామాల్లో పశువైద్య శిబిరాలు


Fri,July 19, 2019 02:29 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే కుల వృత్తులకు సరైన ఆదరణ లభించిందని ఆకారం ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మీనారాగౌడ్ అన్నారు. గురువారం రఘోత్తంపల్లిలో గొల్లకురుమలకు గొర్రెల దాణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ చోరువతోనే గ్రామాల్లో అన్ని కులవృత్తులకు సముచిత న్యాయం చేకూరిందన్నారు. గొల్ల కురుమలకు ఉపాధితో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాదించేందుకు గొర్రెలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవిరెడ్డి , తదితరులున్నారు. పోతారెడ్డిపేట గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకరయ్య, పశువైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తొగుట: పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగించుకోవాలని తొగుట జడ్పీటీసీ గాందారి ఇంద్రసేనారెడ్డి కోరారు. గురువారం మండలంలోని లింగాపూర్, బంజేరుపల్లి గ్రామాల్లో గాలికుంటు నివారణ వ్యాధి కార్యక్రమంను ఆయన ప్రారంభించారు. పెద్దమాసాన్‌పల్లిలో సర్పంచ్ మెట్టు వరలక్ష్మి, ఎంపీటీసీ సుమలత ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో 312 పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బిక్కునూరి రజితాశ్రీశైలం, వైద్యులు రాజేందర్‌రెడ్డి, నిహారిక సిబ్బంది పురుషోత్తం, భూపాల్, గోపాలమిత్రలు వాజిద్ మహేందర్‌రెడ్డి, పశుమిత్ర రేణుక తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...