మొక్కజొన్నలో కత్తెర పురుగుతో అప్రమత్తంగా ఉండాలి


Thu,July 18, 2019 03:18 AM

గజ్వేల్‌రూరల్: ప్రస్తుత సీజన్‌లో మొక్కజొన్న పండిస్తున్న రైతులు కత్తెర పురుగు ద్వారా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని, వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే పంట దక్కే అవకాశం ఉంటుందని గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి, వ్యవసాయాధికారి నాగరాజులు తెలిపారు. బుధవారం మొక్కజొన్నలో ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణ, సస్యరక్షణ చర్యలపై బూర్గుపల్లిలో రైతులకు క్షేత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. కత్తెర పురుగు ఇప్పటికే మండలంలో ఎదిగిన మొక్కజొన్న పంటకు ఆశించిందని వెంటనే మొక్కజొన్న పండించే రైతులు క్లోరాంట్రానిలిపోల్ మందును 0.4 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఎదిగిన లార్వా పంటపై ఉంటే 0.5 మిల్లీ లీటర్లు థైయోమిథాక్జిమ్, లామ్డా సైహాలోథ్రిన్ లీటరు నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలన్నారు. పిల్ల పురుగుల దశలో ఉంటే స్పెనిటోరమ్ లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ను నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. రైతులు క్రిమిసంహారకాలు పిచికారి చేసే ముందుకు స్వయం రక్షణకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వివిధ దశల్లో కత్తెర పురుగు ఆశిస్తే పంట ఎలా ఉంటుందో రైతులకు చూపిస్తూ వివరించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహమాన్, మాజీ ఎంపీపీ చిన్నమల్లయ్య, ఏఈవోలు ప్రియాంక, రైతులు పాల్గొన్నారు.

హరితహారం కార్యక్రమానికి 100 మంది రైతుల ఎంపిక
5వ విడుత హరితహారంలో మొక్కలు నాటడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు బూర్గుపల్లిలో 100 మంది రైతులను గుర్తించామని ఏవో నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఎంపీపీ దాసరిఅమరావతి , అధికారులు బుధవారం బుర్గుపల్లి గ్రామంలో రైతులతో హరితహారంపై చర్చించారు. తమ పొలాల వద్ద, ఇండ్లలో అవసరమైన మొక్కలు అధికారులకు తెలియజేస్తే అధికారులు అందజేస్తారన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...