రూర్బన్ మిషన్ పనులు భేష్


Wed,July 17, 2019 12:17 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: ర్యాకల్ కేంద్రంగా నారాయణఖేడ్ మండలంలో చేపడుతున్న శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలన చేశారు. మంగళవారం కేంద్ర బృందం సభ్యులు నిజాంపేట, నారాయణఖేడ్, సంజీవన్‌రావుపేట గ్రామాల్లో పర్యటించి ఆయా పనులను పరిశీలించారు. రూర్బన్ ప్రత్యేక ప్రణాళిక నిపుణులు విహాగురు, ఎంవోఆర్డీ శ్రీనివాస్‌రెడ్డి, రూర్బన్ మిషన్ జాయింట్ కమిషనర్ వీరారెడ్డి, రూర్బన్ మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ నర్సింహులు, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌రావులు గ్రామంలో పర్యటించి రూర్బన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షించారు. నూతనంగా నిర్మించిన పశువైద్యశాల, పీహెచ్‌సీ, డిజిటల్ తరగతి గదులను నెలరోజుల్లోగా వినియోగంలోకి తేవాలని సూచించారు. గ్రామానికి సంబంధించి పలు విషయాలను సర్పంచ్ జగదీశ్వర్‌చారిని అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు, గర్భవతులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారం, ఆట వస్తువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లను నిర్మించినందుకు గ్రామస్తులను అభినందించడంతో పాటు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను నిర్మించుకునే విధంగా చూడాలని సర్పంచ్‌కు సూచించారు. ఈ సందర్భంగా వారు అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.కాగా, గ్రామాల వారీగా రూర్బన్ మిషన్ పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా నారాయణఖేడ్ సమీపంలోని జూకల్ శివారులో నూతనంగా నిర్మించిన పాలశీతలికరణ కేంద్రం, సంజీవన్‌రావుపేటలో నిర్మించిన సైన్స్‌ల్యాబ్ భవనాలను అధికారులు పరిశీలించారు. వారివెంట ఎంపీడీవో వీరబ్రహ్మచారి, ఎంపీటీసీ సాయిరెడ్డి, ఉపాధిహామీ ఏపీవో రమేశ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...