రైతులకు ఆదాయ భద్రత కల్పిస్తాం


Wed,July 17, 2019 12:17 AM

చిన్నకోడూరు : ప్రజల్లో సామాజికంగా.. ఆర్థికంగా మార్పు తేవడమే డీఎక్స్‌ఎన్ లక్ష్యమని... మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రోత్సాహంతో డీఎక్స్‌ఎన్ ఉత్పత్తి కేంద్రాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నామని డీఎక్స్‌ఎన్ కంపెనీ చైర్మన్ డా.లిమ్‌జీ తెలిపారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో డీఎక్స్‌ఎన్ చైర్మన్‌తోపాటు ప్రతినిధి బృందం పర్యటించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. అనంతరం గ్రామంలో సాగు చేస్తున్న మిర్చి పంటలను డీఎక్స్‌ఎన్ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా డీఎక్స్‌ఎన్ చైర్మన్ లిమ్‌జీ మాట్లాడు తూ.. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది సామాజికంగా మార్పు తెచ్చేదిశగా గుర్రాలగొంది లో డీఎక్స్‌ఎన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పా టు కానుందన్నారు. రైతులు పండించిన పంటలకు కావాల్సిన పెట్టుబడులను కంపెనీ సమకూర్చుతుందని తెలిపారు. అల్లం, పసుపు, నోని, రోజిల్లా లాంటి పంటలను రైతులతో పండించి, వాటిని తాము మార్కెట్ రేటుతో కొనుగోలు చేస్తుందన్నారు. పత్తి పంటను కూడా కొనుగోలు చే స్తామన్నారు. ఇందులో రైతులకు ఉచితంగా నోని, రోజిల్లా విత్తనాలను పంపిణీ చేస్తామన్నారు. పంటలు పండించే విధానంపై రైతులకు మందపల్లిలోని డీఎక్స్‌ఎన్ ప్యాక్టరీలో శిక్షణ ఇస్తామని చెప్పారు. రైతులతో ఒప్పందం చేసుకొని పంటలను తామే మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తామన్నా రు. రైతులకు ఆదాయ భద్రతను కల్పిస్తామని తెలిపారు. అలాగే, స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి తమ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎక్స్‌ఎన్ సంస్థ ప్రతినిధులు సూపి, మంగేశ్, రాజేశ్, గగన్, హమి, సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ హరీశ్, ఉప సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లేశం, సీడీఎస్ ప్రాజెక్టు మేనేజర్ ప్రతీక్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పి.శంకర్, ఏఈవో సంతోశ్, సీడీఎస్ నాయకులు రవి, రాము, దినేశ్, పోతరాజు వినయ్, కిరణ్, నాయకులు కనకయ్య, అంజయ్య పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...