పోలీస్ విధుల్లోనూ కృషి, పట్టుదల చాటాలి


Wed,July 17, 2019 12:16 AM

సిద్దిపేట టౌన్ : ఉద్యోగ సాధించడంలో చూపిన కృషి, పట్టుదలను ఎస్‌ఐ ఉద్యోగ విధుల్లోనూ చాటాని పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. సిద్దిపేటలోని ఉచిత పోలీస్ శిక్షణ సంస్థలో శిక్షణ పొందిన ఐదుగురు విద్యార్థులు ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం సీపీ కమిషనరేట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో కలెక్టర్లు వెంకట్రామ్‌రెడ్డి, కృష్ణభాస్కర్, హైదరాబాద్ భాగ్యకిరణ్ శిక్షణ సంస్థ సహకారం తో జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ పట్టణాల్లో 130రోజుల పాటు ఉచిత పోలీస్ శిక్షణ ఇచ్చామన్నారు. హుస్నాబాద్ మండలం పోతారానికి చెందిన విజయభారతి, నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌కు చెందిన జీకురు జ్యోతి, నారాయణరావుపేటకు చెందిన దుంపటి ప్రసన్న, గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లికి చెందిన గంజిగారి బాలకృష్ణ, అల్లాదుర్గకు చెందిన సుభాష్ ఉచిత పోలీస్ శిక్షణ తీసుకొని ఎస్‌ఐలుగా ఎన్నికయ్యారని తెలిపారు. వీరందరూ ఇక్కడితో ఆగకుండా నిరంతరం శ్రమించి గ్రూపు -1, సివిల్స్ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అనంతరం ఎస్‌ఐలుగా ఎంపికైనవారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే హరీశ్‌రావు, సీపీ జోయల్ డెవిస్, తల్లిదండ్రుల ప్రోత్సాహాంతో ఉద్యోగాలు సాధించామని, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, బాఘ్యకిరణ్ శిక్షణ సంస్థ డైరెక్టర్ భాగ్యకిరణ్, ఏసీపీలు రామేశ్వర్, మహేందర్, నారాయణ, సీఐలు ఆంజనేయులు, ప్రసాద్, శివలింగం పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి.. ఎస్‌ఐలుగా ఎంపికైన ఐదుగురు కానిస్టేబుళ్లను సన్మానించారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఆంజనేయు లు, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...