ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ


Tue,July 16, 2019 03:40 AM

కలెక్టరేట్, నమస్తేతెలంగాణ: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జేసీ పద్మాకర్, డీఆర్‌వో చంద్రశేఖర్, జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తుని పరిశీలించి ఆయా శాఖల వారీగా విభజించి వాటిని పరిష్కరించేలా అధికారులను ఆదేశించామన్నారు. సోమవారం ప్రజావాణికి 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజావాణిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్, డీఎస్‌వో శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ సీఈవో ఓంప్రకాశ్, జిల్లా మైనార్టీ అధికారి జీవరత్నం, మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, వైద్యాధికారి కాశీనాథ్, హార్టికల్చర్ అధికారి రామలక్ష్మి, ఆయా శాఖల అధికారులున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...