గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కృషి


Tue,July 16, 2019 12:13 AM

హుస్నాబాద్‌రూరల్ : గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని భల్లూనాయక్‌తండా, వంగరామయ్యపల్లి, పోతారం(ఎస్) గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లా పరిషత్ నుంచి మండలానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో సీసీరోడ్లు, మురికి కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన హుస్నాబాద్ మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.

కార్యక్రమంలో ఎంపీపీ లకావత్ మానస, సర్పంచ్‌లు వంగ విజయలక్ష్మి, బత్తిని సాయిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామ్‌రెడ్డి, ఎంపీటీసీ బొమ్మగాని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఆలేటి అరవింద, నాయకులు ఇర్రి రాజిరెడ్డి, బండి రమణారెడ్డి, ఆలేటి ఈశ్వర్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...