లక్ష్యాన్ని మించి సభ్యత్వాలు నమోదు చేద్దాం


Tue,July 16, 2019 12:11 AM

-సర్కార్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
-సర్కార్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మద్దూరు : సర్కార్ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎస్‌ఐ పాడి రాజిరెడ్డి అ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, ధూళ్మిట్ట అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లల కు హెడ్‌కానిస్టేబుల్ బాదె రాజు తన సొంత డబ్బులతో నోట్ పుస్తకాలను అందజేశారు. అదేవిధం గా మద్దూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి రూ. 7వేల విలువ చే సే ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను అం దజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐ రాజిరెడ్డి మాట్లాడుతూ.. సర్కార్ పాఠశాలల్లో ప్రభుత్వం సకల వసతులను కల్పిస్తుందన్నారు. అన్ని దానాలలో కంటే విద్యాదానం ఎంతో గొప్పదని, విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పేద విద్యార్థులకు ప్రతి ఏటా నోటు పుస్తకాలను అందజేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ను రాజు, పాఠ్యపుస్తకాలను అందజేసిన సర్పంచ్ జనార్దన్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో వి. శ్రీనివాసవర్మ, ఎంఈవో మొగుళ్ల నర్సింహారెడ్డి, ధూళ్మిట్ట సర్పంచ్ దుబ్బడు దీపిక, మద్దూరు ఎంపీటీసీ బొప్పె కనకమ్మ, ఉపసర్పంచ్ అరీఫ్, ఎస్‌ఎంసీ చైర్మన్ హమీద్, నాయకులు దామెర మల్లేశం, బూర్గు రాజు, కృష్ణ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...