హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి


Tue,July 16, 2019 12:10 AM

కొమురవెల్లి : హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ తలారి కీర్తన అన్నారు. సోమవారం మండలంలోని మర్రిముచ్చాలలో సర్పంచ్ బొడిగం పద్మతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అదే విధంగా నాటిన ప్రతి మొక్క సంరక్షణకు కృషి చేయాలన్నారు. అంతకుముందు సర్పంచ్ బొడిగం పద్మ ఆధ్వర్యంలో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పిచ్చి మొక్కలను తొలిగించడంతో పాటు పారిశుధ్యపనులు చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజమణి, ఉపసర్పంచ్ పర్శరాములు, అంగన్‌వాడీ టీచర్ భవాని, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, కారోబార్ సురేశ్, వార్డు పభ్యులు, నాయకులు తలారి కిషన్, బొడిగం వంశీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలి
చేర్యాల, నమస్తే తెలంగాణ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్న మొక్కలను ఆయా కుటుంబాలు బాధ్యతగా వాటిని పెంచాలని సర్పంచ్ ఎర్రబెల్లి రాంమోహన్‌రావు కోరారు. మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం ప్రతి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 40 వేల మొక్కలను సర్పంచ్ ఇంటింటికీ 6 మొక్కల చొప్పున గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం ఒక సామాజిక బాధ్యతగా కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మిట్టపల్లి సులోచన, ఉపసర్పంచ్ పి.లత, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంబియా రాజు, గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింగరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...