అమ్మకు బోనం


Sun,July 14, 2019 11:47 PM

-గజ్వేల్‌లో మహంకాళి ఉత్సవాలు
-అమ్మవారికి బోనం సమర్పించిన జడ్పీచైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ
-హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌
-ఇంటింటా పండుగ వాతావరణం
-ఆకట్టుకున్న పోతరాజు విన్యాసాలు
గజ్వేల్‌ రూరల్‌ : గజ్వేల్‌ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. మహంకాళి ఉత్సవాలు మూడురోజులుగా జరుగుతున్న క్రమంలో చివరి రోజు ఆదివారం పట్టణంలోని మహిళంతా అమ్మవారికి భక్తిప్రపత్తులతో బోనాలను ఇండ్ల నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి మహంకాళి పాత ఆలయం, కొత్త ఆలయాల వద్ద అమ్మవార్లకు సమర్పించారు. ఉదయం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కాల్వ శ్రీధర్‌రావు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొ దటి బోనాన్ని సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు తండోపతండాలుగా తరలివచ్చారు. కాగా, జడ్పీచైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ సతీమణి, మాజీ వైస్‌చైర్మన్‌ దుంబాల అరుణ భూపాల్‌రెడ్డి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. వారితో పాటుఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పొన్నాల రఘుపతిరావు, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ దాసరి అమరావతి శ్యాంమనోహర్‌, జడ్పీటీసీ పంగ మల్లేశం, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి బోనాల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను అర్చకులు చాడ నందబాలశర్మ, సోమనాథ సిద్ధాంతి, సాయి నిర్వహించారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...