రోడ్డు ప్రమాదాల నివారణకుఆర్టీఏ ప్రత్యేక కార్యాచరణ


Fri,July 12, 2019 11:44 PM

-అటవీ శాఖలో 34మంది బీట్ ఆఫీసర్లు బాధ్యతలు
సిద్దిపేట టౌన్ : ప్రపంచంలో దేన్నైన కొనగలం కానీ గాలిని కొనలేమని, గాలి కావాలంటే అడవులను పరిరక్షించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకు కొత్తగా అటవీ శాఖలో 34 మంది బీట్ ఆఫీసర్లు బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే హరీశ్‌రావు వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ అడవులు అంతరించిపోతున్నాయని, అంతరించిపోయే అడవులకు పునర్జీవం పోయాలని సూచించారు. అడవుల సంరక్షణకు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. మొక్కలు చెట్లుగా మహావృక్షాలుగా చేసే బృహత్తర కార్యక్రమం అటవీ బీట్ అధికారులపై ఉందన్నారు. హరితహారంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. ప్రజాప్రతినిధి, ఉద్యోగి అయిన చేయాల్సింది ప్రజా సేవ అని, చదువు సంస్కారం నేర్పుతుందని, ఉద్యోగంతో ప్రజా సేవ చేయాలని చెప్పారు. బీట్ అధికారులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా వృత్తిధర్మాన్ని త్రికరణ శుద్ధితో చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...