ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి


Wed,June 19, 2019 11:28 PM

-చదువుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
- ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలి
- ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి
రాయపోల్: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను చేర్పించాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్త్రెవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ప్రతిగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం కోసం ఆయా గ్రామాల సర్పంచ్‌లు ముందుకువచ్చి కృషి చేయాలన్నారు. సర్కార్ బడులను కాపాడుకుంటే అందరికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా విద్యార్ధుల తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. చదువులో ముందుంటే రానున్న రోజుల్లో ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో ఉన్నతమైన స్థానాల్లో ఉండేందుకు అవకాశముంటుందన్నారు. సమయాన్ని వృథా చేసుకోకుండా చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివితే విజయం సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్ధి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఇందుకోసం విద్యార్థులు కాలాన్ని వృథా చేయకుండా పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సవ్వ, గ్రామ సర్పంచ్ అప్పవారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు, జిల్లా పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, దౌల్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, రాయపోల్ మండల శాఖ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, సీఆర్‌పీలు రాజు, చంద్రమౌళి, పాఠశాల ఉపాధ్యాయులు నవీన్‌రెడ్డి, రాజసింహ, అనిల్, గ్రామస్తులు, పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...