కాళేశ్వరంతో హుస్నాబాద్ సస్యశ్యామలం


Wed,June 19, 2019 11:28 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకం గా నిర్మించిన కాళేశ్వరంతో హు స్నాబాద్ నియోజకవర్గంలోని గౌ రవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను అనుసంధానం చేయడం ద్వారా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేయొచ్చని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. బుధవా రం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ, ఆరెపల్లిలో ఉచిత నట్టల మందు పంపిణీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మెట్టప్రాంతాల్లో శాశ్వత కరువు నివారణ జరుగుతుందన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా మారిపోతాయన్నారు. మెట్ట ప్రాంతాల రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను వేగవంతంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, తహసీల్దార్ దశరథ్‌సింగ్, నాయకులు వంగ వెంకట్రాంరెడ్డి, మ్యాక నారాయణ, ఎండీ అన్వర్, అశోక్‌బాబు పాల్గొన్నారు.
అభివృద్ధిలో మునుముందుకే..
కోహెడ : అభివృద్ధిలో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజవర్గాన్ని ఇక మునుముందుకే తీసుకువెళ్తానని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 11మంది లభ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 5 లక్షల 16వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథతో తెలంగాణలోని అన్నిగ్రామాల్లో తాగునీటి గోస పోయిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వామి, జడ్పీటీసీ లక్ష్మణ్, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో దేవేందర్‌రాజు, మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల మహేందర్, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఆంజనేయులు ఉన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...