కాల్వల భూసేకరణ వేగవంతం చేయాలి


Tue,June 18, 2019 11:42 PM

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని తహసీల్దార్లు, ఇరిగేషన్‌ ఇంజినీర్లు, సర్వేయర్లను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, డీఆర్‌వో చంద్రశేఖర్‌, ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, అనంతరెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్‌, ఈఈ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్లు, ఇరిగేషన్‌ ఇంజినీర్లు, సర్వేయర్లతో భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. మిడ్‌మానేరు ప్యారాలాల్‌ కన్వయిర్‌ సిస్టమ్‌ ద్వారా కావాల్సిన భూసేకరణ అంశాలపై క్షేత్రస్థాయిలోని పరిస్థితిని, ఉత్పన్నమయ్యే సమస్యలను వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చ ర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మిడ్‌ మానేరు నుంచి రోజు ఒక టీఎంసీ నీళ్లు నింపడం కో సం ప్యారాలాల్‌ కన్వయిర్‌ సిస్టమ్‌ను ప్రతిపాదించినట్లు, ఇందుకోసం జిల్లాలో కాల్వల భూసేకరణకు 1373 ఎకరాల భూ మి అవసరం కాగా ఇప్పటికే 394 ఎకరాల భూసేకరణ పూ ర్తయిందని, ఇంకా 978 ఎకరాల భూసేకర ణ చేయాల్సి ఉందన్నారు.

మిగిలిన భూసేకరణ ప్రణాళికబద్ధంగా చేపట్టాలని ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రా మాలకు కాల్వలు తవ్వించి సాగునీరు అం దించడానికి వీలుగా అవసరమైన భూమిని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని ఆదేశించా రు. జిల్లాలోని బెజ్జంకి మండలం గుం డారం, బెజ్జంకి, కల్లెపల్లి, ముత్తన్నపేట, దా చారం, వీరాపూర్‌, తోటపల్లి గ్రామాల్లో కా ల్వల భూసేకరణతో పాటు చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి, విఠలాపూర్‌, మా చాపూర్‌, గంగాపూర్‌, చంద్లాపూర్‌, రామంచ, సిద్దిపేట అ ర్బన్‌, రూరల్‌ మండలంలోని పుల్లూరు, చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి, ఇర్కోడు, ఎన్సాన్‌పల్లి, వెంకటాపూర్‌, తడ్కప ల్లి, తొగుట మండలంలోని బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, ఘణపూర్‌, తుక్కాపూర్‌ గ్రామాల్లో కాల్వల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్లను, సర్వేయర్లను ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కాల్వల భూసేకరణలో భాగంగా ఉత్పన్నమ య్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, భూతగదాలు, ఇతర సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్వేయింగ్‌ ఏడీ మహేందర్‌తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...