సీసీ కెమెరాలతో భద్రత


Tue,June 18, 2019 11:42 PM

చిన్నకోడూరు : సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామ ప్రజలకు భద్రతతో పాటు భరోసాగా జీవించేందుకు ఉపయోగపడుతాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నారాయణరావుపేట మండలం మాటిండ్లలో మంగళవారం సీసీ కెమెరాలు, బొడ్రాయి, మదిర గ్రామం శేఖరావుపేటలో నూ తనంగా ప్రతిష్ఠించిన ఆంజనేయస్వా మి ఆలయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కా ర్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన నారాయణరావుపేట మండలంలోని మాటిండ్ల గ్రామానికి భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో దొంగతనాలు అరికట్టడానికి గ్రామస్తులందరికీ భద్రత కల్పించడానికి ఉపయోగపడుతాయన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుద్దామని తెలిపారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన నారాయణరావుపేట ఎంపీపీ బాలకృష్ణయాదవ్‌, సర్పంచ్‌ కొంగరి నారాయ ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మునిగెల రేణుక, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు సుమన్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు మైసయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...