సర్కార్‌ బడుల్లోనే సకల వసతులు


Tue,June 18, 2019 11:41 PM

కొమురవెల్లి: సర్కార్‌ బడుల్లోనే సకల వసతులు ఉంటాయని హెచ్‌ఎం బి.రంగారావు అన్నారు. మంగళవారం మండలంలోని గురువన్నపేటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పనులు జరిగే చోటుకు వెళ్లి ప్రభుత్వ బడి ఆవశ్యకత గురించి వివరించారు. ఈసందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ ప్రవేటు పాఠశాలల మోజులో పడి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రవేటు పాఠశాలకు పంపి వారిని చిన్న వయస్సు నుంచే ఒత్తిడి గురిచేసున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిపామ్స్‌తో పాటు మధ్యాహ్న భోజనం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. గ్రామంలోని బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి ప్రభుత్వం అందించే ఉచిత వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...