తెలంగాణ గురుకులాలుదేశానికే ఆదర్శం


Mon,June 17, 2019 11:27 PM

సిద్దిపేట అర్బన్: రాష్ట్రంలోని గురుకులాలు దేశానికే ఆదర్శంగా మారుతున్నాయని సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రో జాశర్మ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, జడ్పీ చైర్‌పర్స న్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నదన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడం కోసం ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. గతంలో కూడా 119 గురుకుల పా ఠశాలలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూ డిన విషయమన్నారు. దీంతో జి ల్లాలో మూడు చోట్ల గురుకుల పాఠశాలలు ప్రారంభించినట్లు చెప్పారు.

కలెక్టర్ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్క డా లేని విధంగా అ త్యంత ప్రాధాన్యాన్ని ఇస్తూ, మంచి ప్రమాణాలతో గురుకుల పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 119 గురుకుల పాటశాలలు ఒకే రోజు ప్రారంభించడం గొప్పవిషయమన్నారు. తన చిన్నతనంలో వసతి గృహంలో అత్యంత దుర్భర పరిస్థితులను ఎ దుర్కొన్నామన్నారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పు లు తెచ్చి, మంచి విద్యను అందిస్తున్నదన్నారు. ఒక్కో పాఠశాలలో 240మంది విద్యార్థులకు అవకాశముంటుందన్నా రు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చదివిస్తే, వారి మంచి భవిష్యత్ పునాది వేసిన వారవుతారన్నారు. రా నున్న వారం రోజుల్లో పాఠశాలకు కావాల్సిన వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, పొన్నాల సర్పంచ్ రేణుకా, సిద్దిపేట అర్బన్ ఎంపీపీ వంగసవిత, ఎంపీటీసీ ఎద్దు యాదగిరి, బీసీ సోషల్ వెల్ఫేర్ అధికారి సరోజ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...