ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు


Mon,June 17, 2019 11:26 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : హుస్నాబాద్‌లోని రే ణు కా ఎల్లమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. నెల రోజుల పాటు జాతర ఉత్సవాలు అ త్యం త వైభవంగా జరుగగా చివరి రోజు కూడా భక్తులు అ ధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మే 18వ తేదీన అమ్మవారికి బా సికం కట్టి కల్యాణోత్సవం జరిగిపించడం ద్వారా ఉత్సవాలు ప్రారంభం కాగా, చివరి రోజు అ మ్మవారి బాసికాలను తొలిగించ డం ద్వారా ఉత్సవాలు ముగిసినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పూజారి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి విశ్వనాథశర్మ సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పట్టణానికి చెందిన గౌడ కులపెద్దలు అమ్మవారి బాసికం తీసేశారు. నెల రోజు ల్లో మంగళ, శుక్ర, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వ చ్చి పూజలు చేయగా మిగతా రోజుల్లో భక్తులు సాధారణం గా వచ్చేవారు.

సోమవారం జాతర ముగుస్తున్నందున భ క్తులు పొటెత్తారు. అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఒడిబియ్యం పోసి, చీరె కనుములు సమర్పించారు. ఆలయం బయట అమ్మవారికి బోనం, పట్నం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు కోళ్లు, గొ ర్రెలు, మేకలను సమర్పించారు. బైండ్ల పూజారులు పట్నం వేసి ఎల్లమ్మ కథ చెప్పారు. ఆలయం ఆవరణలోనే వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. జాతర ముగింపు కార్యక్రమంలో ఈవో విశ్వనాథశర్మ, కౌన్సిలర్ దండి లక్ష్మి, గౌడ కుల పెద్దలు పచ్చిమట్ల శ్రీనివాస్‌గౌడ్, పూదరి లక్ష్మీనారాయణగౌడ్, పచ్చిమట్ల రవీందర్‌గౌడ్, శివగౌడ్, ఆలయ సిబ్బంది కుమార్, హన్మంతు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...