ప్రారంభమైన పెద్దమ్మ ఉత్సవాలు


Mon,June 17, 2019 11:26 PM

నంగునూరు : మండల కేంద్రమైన నంగునూరులోని తోకలకొండపై వెలసిన పెద్దమ్మ 2వ వార్షికోత్సవ మహోత్సవాలు సోమవారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. తోకల కొండపై పెద్దమ్మ దేవాలయ పునర్నిర్మాణానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సహకారంతో రూ.22 లక్షలతో నూతన ఆలయాన్ని నిర్మింపజేశారు. సోమవారం మొదటి రోజున ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు, మహిళలు సాయంత్రం డప్పు చప్పుళ్లు, బోనాలతో ఊరేగింపు నిర్వహించి పోచమ్మ, పెద్దమ్మ దేవాలయాల్లో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. 19న జరిగే పెద్దమ్మతల్లి కల్యాణానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు, ముదిరాజ్ కులస్తులు తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...