ఆకునూరు పాఠశాల పరిశీలన


Mon,June 17, 2019 11:25 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : చేర్యాల ఉమ్మడి మండలంలో ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న మండలంలోని ఆకునూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం కొమురవెల్లి మండలం గురువన్నపేట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బి.రంగరావు ఆధ్వర్యంలో పలువురు యువకులు పరిశీలించారు. మధ్యాహ్న భోజనంతో పాటు గ్రామస్తుల సహకారంతో ఎస్‌ఎమ్‌సీ కమిటీ కల్పించిన మౌలిక వసతుల గూర్చి అడిగి తెలుసుకోవడంతో పాటు పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే విధానాన్ని తమ పాఠశాలలో కొనసాగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎచ్‌ఎం సులోచన, ఉపాధ్యాయులు యాదయ్య, భాస్కర్, ఎస్‌ఎంసీ చైర్మన్ కొంక శశిధర్, గురువన్నపేట యువకులు బుడిగె జహంగీర్, బచ్చల చంద్రకుమార్, తుక్కొజి అనిల్‌కుమార్, బుడిగె చక్రిగౌడ్, కిషన్, చందమౌళి తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...