నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే..


Mon,June 17, 2019 11:24 PM

దుబ్బాక టౌన్: ఫెర్టిలైజర్ షాపుల యజమానులు రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే జైలు శిక్ష తప్పదని దుబ్బాక ఏడీఏ శ్యాంసుందర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక ఏడీఏ కార్యాలయంలో ఫైర్టిలైజర్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు తప్పనిసరిగా బిల్లును అందజేసే బాధ్యత దుకాణం దారుడిదేనని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని అవసరమైతే పోలీస్ శాఖ సహాయంతో పీడీ యాక్టును అమలు చేసేందుకు వెనకాడబోమన్నారు. దుబ్బాక ఏడీఏ పరిధిలో బీటీ పత్తి విత్తనాలు ఎక్కడా లేవని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి ప్రవీణ్, ఏఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...