వానకాలం పంటలకు అన్నదాతలు సిద్ధం


Mon,June 17, 2019 12:16 AM

మిరుదొడ్డి: మిరుదొడ్డి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గత వారం రోజులు క్రితం కురుసిన వర్షంతో రైతులు తమ వ్యవసాయ సాగు భూములను చదును చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మొదటి విడతలో 40 చెరువులు, కుంటలు అభివృద్ధికి నోచుకోగా, రెండో విడుతలో 41 చెరువు, కుంటలు పనులు పూర్తి కాగా , మూడో విడుతలో 16 చెరువు, కుంటల్లో సైతం పనులు పూర్తి కాగా, నాలుగవ విడతలో 19 చెరువు, కుంటలు మంజూరు కాగా 9 పూరై, మరో 10 చెరువు, కుంటల్లో పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. రైతులు తమ పంట భూముల్లో దుక్కులు దున్ని విత్తనాలు వేసే ముందు రాత్రి 7 గంటల సమయంలో అక్కడక్కడ చెత్తా చెదారం పనికి రాని కట్టెలను పోగు చేసి భూము (గుడ్డా) ల్లో సామూహిక మంటలు పెడుతున్నారు. దీంతో ఈ మంటల్లో రాత్రి సమయంలో కావడంతో మొక్క జొన్న, కంది, వరి, పెసర, బబ్బెర, బీర్నీస్ పంటలకు హానిని తలపెట్టి మొక్కలు ఏపుగా పెరగకుండా రైతును ఆర్థికంగా దెబ్బతీసే రెక్కల (తల్లి) పురుగు మంటల్లో పడి నశిస్తుంది.

మిషన్ కాకతీయ పథకంలో చెరువు, కుంటల్లో తీసిన పూడిక మట్టిని రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేయడంతో పోషక లవణాలు వృద్ధి చెంది పంటలు సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయనే ఉద్దేశంతోనే మూలన పడిన బోరు మోటర్లను, నాగళ్ల (అరక)ను సరి చేసుకుంటూ ఖరీఫ్ సీజన్‌కు సిద్దమవుతున్నారు. వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం మండల పరిధిలోని 12,200 ఎకరాల్లో మొక్క జొన్న పంట, 3,650 ఎకరాల్లో వరి పంట, 650 ఎకరాల్లో కంది పంట, 1,820 ఎకరాల్లో పత్తి పంటలు వేయనున్నట్లు అంచనా వేశారు. 20 గ్రామ పంచాయతీల గ్రామాలకు చెందిన రైతులకు సరిపడే విధంగా ఆగ్రో రైతు సేవా కేంద్రాలతో పాటు, ఇతర ఫర్టిలైజర్స్‌ల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుటికే 4 వందల క్వింటాళ్ల మొక్క జొన్న విత్తనాలతో పాటు 120 మెట్రిక్ టన్నుల యూరియా, 180 టన్నుల కాంప్లెక్స్, 14 మెట్రిక్ టన్నుల డీఏపీ రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా నేడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల విత్తనాలను 50 శాతం సబ్సిడీ పై రైతులకు సరఫరా చేస్తుండడంతో పాటు పంటలకు సరి పడే ఒక ఎకరానికి రూ.5 వేలు చొప్పున రైతుల బ్యాంకుల ఖాతాల్లో డబ్బులను జమ చేయడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...