ట్రిపుల్ ఐటీకి విద్యార్థుల ఎంపిక


Mon,June 17, 2019 12:16 AM

రాయపోల్: దౌల్తాబాద్ మోడల్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజేందర్ ఆదివారం పేర్కొన్నారు. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం 10వ తరగతి పరీక్షలలో కార్తీక్,10-10, దినేష్ (9.8), సౌమ్య( 9.8,) దివ్య (9.8) మార్కులు జీపీఏ సాధించారని, విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటికి దరఖాస్తులు చేసుకోగా నలుగురు విద్యార్ధులకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు

ట్రిపుల్ ఐటీకి ఎంపికైన నిరుపేద విద్యార్థి
రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నిరుపేద విద్యార్ధి ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ పేర్కొన్నారు.ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నందు మండల టాపర్‌గా నిలిచాడు. కాగా నిరుపేద కుటుంబానికి కుమ్మరి నందు(9.8)బాసర ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోగా ఎంపికైనట్లు ఆయన తెలిపారు.

16 మంది విద్యార్థుల ఎంపిక
దుబ్బాక టౌన్: ఇటీవల విడుదలైన 10 వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన దుబ్బాక మండలం నుంచి ట్రిపుల్ ఐటీకి 16 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఎంఈవో ప్రభుదాస్ తెలిపారు. దుబ్బాక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు, పోతారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు, లచ్చపేట మోడల్ స్కూల్ నుంచి ఆరుగురు విద్యార్థులు, ఎనగుర్తి, చీకోడ్, రామేశ్వరంపల్లి పాఠశాల నుంచి ఒక్కో విద్యార్థి ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ఎంఈవో తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...