సేంద్రియ ఎరువులను వాడండి: ఏవో


Sun,June 16, 2019 12:18 AM

మిరుదొడ్డి : రైతులు తమ వ్యవసాయ భూముల్లో సేంద్రియ ఎరువులను వాడడం మూలంగా భూ సారం పెరిగి పంటలు అధికంగా పండే అవకాశం ఉందని మిరుదొడ్డి వ్యవసాయ శాఖ అధికారి బోనాల మల్లేశం అన్నారు. శనివారం మిరుదొడ్డి మండల పరిధిలోని మోతె గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పంటలు పండించే విధనాల పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ వాన కాలంలో రైతులు భూముల్లో జొన్న, రాగులు, సామలు వంటి చిరు ధాన్యాల పంటలను పండించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చిరు ధాన్యాల విత్తనాలనును రైతులకు 90 శాతం సబ్సిడీ పై అందిస్తుందన్నారు. జిలుగ, జనుము, చిరు ధాన్యాల విత్తనాలు మిరుదొడ్డి, భూంపల్లి ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల్లో రైతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ భూముల్లో రైతులు రసాయన ఎరువులు వాడడంతో భూ సారం తగ్గి సరైన పంటలు పండడం లేదన్నారు. రసాయన ఎరువులను పంటలకు వాడడంతో ప్రజల ఆరోగ్యాలు రోగాలతో క్షిణిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కాలేరు శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య, ఏఈవో ఎండీ.సమ్రీన్‌ బేగం, గ్రామ రైతులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...