అమర్‌నాథ్‌ యాత్రికులకు అన్నదానం


Sun,June 16, 2019 12:17 AM

సిద్దిపేట టౌన్‌ : అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ అన్నారు. సిద్దిపేట అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్‌నాథ్‌కు వెళ్లే ఆహార సామగ్రి లారీకి శనివారం పూజలు నిర్వహించారు. అంతకు ముందుగా వైశ్యభవన్‌లో శివ కల్యాణం నిర్వహిం చారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ హాజరై, మాట్లాడారు. అమర్‌నాథ్‌ అన్నదాన సేవలను జిల్లావాసులుగా గొప్పగా చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. దైవ సంకల్పంతో ఏ కార్యమైన ఫలిస్తుందన్నారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో సిద్దిపేట ముందుందని చెప్పారు. అమర్‌నాథ్‌లో అన్నదానం చేయడం సాహసోపేతమని, ఇలాంటి కార్యక్రమాల్లో అంద రూ భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు. అన్నింట్లో ముందున్న సిద్దిపేట.. ప్లాస్టిక్‌ నిషేధంలోనూ ముందుండి ఆదర్శంగా నిలువాలని సూచించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటను రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుంచారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి.. పర్యావరణాన్ని పరిరక్షించాని ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌ పిలుపునిచ్చారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ మాట్లాడుతూ.. జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి నిర్వహించిన మొదటి కార్యక్రమంలో పాల్గొనడం దైవసంకల్పమని అన్నారు. అమర్‌నాథ్‌ తోపాటు కేదారినాథ్‌లో యాత్రికుల కోసం తెలుగు వంటకాలు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు మాట్లాడుతూ.. భగవంతుడి కరుణ ఉంటేనే అన్ని సాధ్యమవుతాయన్నారు. అమర్‌నాథ్‌ సేవా సమితి సభ్యులు చేపట్టే సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ.. సిద్దిపేట దాతృత్వానికి నిలయమని, ఇక్కడి ప్రజలు గొప్ప హృదయం కలిగిన వారన్నారు. అనంతరం సేవా సమితి సభ్యులు అమర్‌నాథ్‌ అన్నదానానికి సహకరిస్తున్న వారిని, అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్‌, గంప శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మల్యాల ప్రశాంత్‌, కరాచీ బేకరి అధినేత లేక్‌రాజు, ప్రముఖ వైద్యులు రామచందర్‌రావు, రమాదేవి, టీఆర్‌ఎస్‌ నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు, నందిని శ్రీనివాస్‌, సభ్యులు మాంకాల నవీన్‌కుమార్‌, నేతి కైలాసం, వేద పండితులు శ్రీరామశర్మ, నాగరాజుశర్మ ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...