సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి


Sat,June 15, 2019 12:09 AM

-భూ సమస్యలను పూర్తి చేయాలి
-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
-మద్దూరులో కల్యాణలక్ష్మి, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
మద్దూరు : సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్‌ కార్యాలయంలో 127మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, 94 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అందజేశారు. ఎంపీపీ మంద మాధవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి శిస్తును మాఫీ చేసి, రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. పెండ్లీడుకు వచ్చిన ఆడపడుచులకు అండగా నిలువాలనే లక్ష్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో ప్రాదేశిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని తెలిపారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారని, ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్‌, తపాసుపల్లి రిజర్వాయర్‌లకు సాగునీరు రానున్నట్లు తెలిపారు. రాను న్న రోజుల్లో మండలంలోని చెరువులన్నింటినీ నింపుతారని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నాచగోని పద్మ, తహసీల్దార్‌ గియాసున్సీసాబేగం, ఎంపీడీవో శ్రీనివాసవర్మ, వైస్‌ఎంపీపీ చల్లా లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సూర్న ఐలయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘ధర్మగంట’ను మ్రోగించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్ర చురితమవుతున్న ‘ధర్మగంట’ శీర్షిక ను స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్యే ము త్తిరెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టను న్నారు. ఈ నెల 25న మద్దూరు తహసీల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదేశించారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...