రైతుబంధు @ రూ.304 కోట్లు


Sat,June 15, 2019 12:08 AM

-రూ.171 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ
-ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం
-జిల్లాలో 2,59,802 మంది రైతులు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం రైతుల్లో భరోసా నింపుతున్నది. ఈ ఏడాది వానకాలం పంట పెట్టుబడి సాయం కింద జి ల్లాకు రూ.304 కోట్లను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,59,802 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే రూ.171 కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమ చేశారు. మిగిలినవి నాలుగైదు రో జుల్లో రైతులందరి ఖాతాల్లో జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరో వైపు జిల్లాలో వానకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యం లో రైతుబంధు సా యం అందడంతో రై తులు హర్షం వ్యక్తం చే స్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 22 మండలాల్లోని అన్ని గ్రామాల్లో కలుపుకొని మొత్తం 2,59,802 మంది రైతులు ఉన్నా రు. గత మే మాసం జూన్‌ మొదటి వా రంలో జిల్లా వ్యవసా య శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టి రైతుల వివరాలను సేకరించారు. వారు సాగు చేసే పంటలను వివరాలు కూడా నమోదు చేశారు.

ఆయా మండలాల్లోని ఏవో ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు రైతు సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. అన్ని గ్రామాల నుంచి వచ్చిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయ శాఖ నుంచి ట్రెజరీకి 1,73,666 మంది రైతుల ఖాతాల వివరాలు పంపగా వారందరికీ నేరుగా రైతుబంధు డబ్బులు జమ చేశారు. మిగిలినవి కూడా ఈ నాలుగైదు రోజుల్లో రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడంతో సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతుబంధు సహాయం అందడంతో పెట్టుబడి డోకా లేకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నామని పలువురు రైతులు తెలుపుతున్నారు. దుక్కులు దున్నుకోవడానికి ఈ పెట్టుబడి సాయం ఎంతో దోహదపడిందంటున్నారు. గత ఏడాది ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా ఈ ఏడాది రూ.5 వేలు పెంచడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అకౌంట్లు ఫ్రీజ్‌ చేస్తున్న బ్యాంకు అధికారులు
జిల్లాలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతుంటే బ్యాంకు అధికారులు రైతులకు మొండిచేయి చూపుతున్నారు. రైతులకు సంబంధించి అకౌంటర్లను ఫ్రీజ్‌ చేస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాలకు చెందిన రైతులు రైతుబంధు తీసుకోకుండా బ్యాంకు అధికారులు అకౌంట్లను ఫ్రీజ్‌ చేయడంతో రైతుబంధు అందకుండా పోతున్నది. ఈ విషయమై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రైతుబంధు డబ్బులు తీసుకునేలా బ్యాంకు అధికారులకు సూచనలు చేయాలని కోరుతున్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...