ఆరోగ్య సిద్దిపేట దిశగా అడుగులు వేద్దాం


Fri,June 14, 2019 12:29 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ప్రతి మనిషి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుంది. సిద్దిపేటను ఆరోగ్య సిద్దిపేటగా మార్చేందుకు మనమంతా సమిష్టిగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట పట్టణంలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చూపిన బాటలోనే సిద్దిపేట వాసులంతా సంప్రదాయాలను పాటిస్తూ కులమతాలకు అతీతంగా ఒకరిపై ఒకరు సోదరభావంతో పండుగలు జరుపుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గత 16 సంవత్సరాలుగా రంజాన్ వేడుకలు ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులు కలిసి జరుపుకుంటున్నారని, దసరా పండుగ రోజు ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ ఆధ్వర్యంలో హిందువులకు నర్సపురం చౌరస్తా వద్ద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలుపడం జరుగుతుందన్నారు. నిరుపేద ముస్లిం పిల్లల విద్య కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. ఈ విద్యాలయాల ఏర్పాటుతో గొప్ప మార్పు రాబోతుందన్నారు. భవిష్యత్తులో గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు మంచి స్థానాల్లో ఉంటారన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్న చోటే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కొంత మంది స్వార్థ రాజకీయాల కోసం కులమతాల మధ్య అనవసర గొడవలు సృష్టిస్తారన్నారు. ఇలాంటి కలుపుమొక్కలను ఏరి వేయాలన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా క్యాన్సర్‌లాంటి వ్యాధులు వస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. ప్రజలందరి సహకారంతో ఆరోగ్య సిద్దిపేట నిర్మాణంకు అడుగులు వేద్దామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్‌పటేల్‌తో పాటు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...