నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే..


Fri,June 14, 2019 12:28 AM

గజ్వేల్ రూరల్: రైతులకు నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడమేకాకుండా అమ్మినవారిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలు శిక్ష కూడా విధిస్తామని ఏడీఏ అనిల్‌కుమార్ అన్నారు. గురువారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోని విత్తన, ఎరువుల దుకాణాలను ఏడీఏ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాలలోని విత్తనాల ప్యాకెట్లను, అమ్మకాలకు సంబంధించి రసీదులను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ అనిల్‌కుమార్ మాట్లాడుతూ రైతులను నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అంటగట్టి మోసానికి పాల్పడే వ్యాపారులైనా, కంపెనీలైనా ఊపేక్షించేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సై లక్ష్యంగా పనిచేస్తున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏ దుకాణాంలోనైనా నకిలీ విత్తనాలు గానీ, మందులు గానీ విక్రయించినట్లు సమాచారం వచ్చినా వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. వ్యాపారులు జాగ్రత్తగా మసులుకోవాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలని సూచించారు. ఈ తనిఖీలో ఏడీఏ వెంట ఏవో నాగరాజు కూడా ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...