మల్లన్నసాగర్ చెక్కుల చోరీ కేసులో పురోగతి


Fri,June 14, 2019 12:28 AM

సిద్దిపేట టౌన్ : సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మల్లన్నసాగర్ చెక్కులను మాయం చేసి లక్షల రూపాయలు కాజేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చెక్కు ల అవకతవకల కేసు జిల్లాలో కలకలం సృష్టించిన విష యం తెలిసిందే. సుమారు మూడు రోజుల పాటు నిందితుల కోసం గాలించి ఓ నిందితుడ్ని గురువారం అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్ పోలీసుల కథనం...
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు చెక్కులు పంపిణీ చేసే క్రమంలో ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీసీ సందీప్ చేతివాటం ప్రదర్శించారని తెలిపారు. అందులోంచి చెక్కులను దొంగిలించి అతని స్నేహితుడైన పాషాకు ఇచ్చాడు. రూ.50 లక్షల చెక్కును డ్రా చేశారు. ఇద్దరు రూ.25 లక్షల చొప్పున పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, పాషా సందీప్ ఖాతాలో రూ.5 లక్షలను జమ చేసి, మిగతా పైసలు ఇవ్వకుండా తప్పించుకు తిరిగాడు. చెక్కులు మాయమైన విషయంలో విచారణ జరుగుతుందని తెలుసుకున్న సందీప్.. లాంగ్‌లీవ్ పెట్టి థాయ్‌లాండ్, బ్యాంకాక్‌కు పారిపోయాడు.
ఈ నెల 10న వరంగల్‌కు వచ్చాడు. కేసు విచారణ జరుగుతుందని తెలుసుకున్న సందీప్ వాస్తవాలు తెలిపేందుకు హైదరాబాద్ వచ్చాడు. వన్‌టౌన్ పోలీసులు ఇంటి ని సోదా చేయగా ఇంట్లో రూ.3 లక్షలు లభించాయి. ఈ మేరకు సందీప్‌ను అదుపులోకి తీసుకొని అతడిపై ఐపీసీ సెక్షన్లపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. మరో నిందితుడు పాషాను త్వరలోనే పట్టుకుంటామని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...