సమిష్టిగా ముందుకెళ్తాం..


Thu,June 13, 2019 12:07 AM

-అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం..
-రెండోసారి కలెక్టర్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్, సర్కారుకు కృతజ్ఞతలు
-రెవెన్యూ సమస్యలపై కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్
-ఫిబ్రవరిలో ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ పూర్తి..
-నమస్తే తెలంగాణతో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
-కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా అ ధికార యంత్రాంగమంతా ఒక కుటుంబంలా ప ని చేసి సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా రిజర్వాయర్లకు జిల్లాలో భూసేకరణ చేపట్టి పరిహారం అందించాం.. జిల్లాలోని రెవెన్యూ, విద్యా, వై ద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాటి సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం.. నాపై నమ్మకంతో రెండోసారి సిద్దిపేట కలెక్టర్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యే క ధన్యవాదాలు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తా.. అని సిద్దిపేట నూతన కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నమస్తే తెలంగాణ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. జిల్లా అభివృద్ధి, ఇతర అంశాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయ ర్లు నిర్మిస్తున్నారని, వాటన్నింటికీ భూసేకరణ పూ ర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందిస్తున్నారన్నారు. కొండపోచమ్మ రి జర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న గ్రా మాలకు తున్కిబొల్లారం వద్ద ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు నిర్మిస్తున్నారని, జూలైలో పూర్తి చేసి ముంపు గ్రామాల వారికి అందజేస్తామని చెప్పారు. అన్ని వసతులతో కూడిన కాలనీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రా మాల ప్రజలకు గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ పక్కన ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు ఏర్పా టు చేస్తున్నామని, వచ్చే ఫిబ్రవరి నాటికి ఈ కాలనీలు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేస్తామన్నా రు. ఆర్‌అండ్‌ఆర్‌కాలనీలు పూర్తయ్యాకనే వారిని అక్కడకు పంపుతామని, ఇందులో ఎవరూ అపో హ పడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఎక్క డా లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున భూసేకరణ జరిగిందని, వచ్చే ఎనిమిది నెలలు జిల్లా అధికార యంత్రాంగమంతా కష్టపడి పని చేయాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా తామంతా కలిసికట్టుగా ఒక కుటుంబంలా వ్యవహరించి, ముందు కు పోదామని చెప్పారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక సెల్
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో నలుగురు సిబ్బందితో ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ సెల్ ఏర్పాటు చేస్తామని, ప్రధానంగా రెవెన్యూ, భూసర్వే, రైతుబంధు సమస్యల పై ఫిర్యాదులను స్వీకరించి, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారన్నారు. జిల్లాలో ప్రధానంగా విద్యా, వై ద్యం, రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైల్వేలైన్ కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేస్తామని, ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తయ్యాయన్నారు. రెండో దశ రైల్వేలైన్ పనులు జరుగుతున్నాయని, కాల్వల కోసం కాళేశ్వరం భూసేకరణ పూర్తి చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్ ధన్యవాదాలు
సీఎం కేసీఆర్ జిల్లాలో రెండోసారి పని చేయ డం అదృష్టంగా భావిస్తున్నానని వెంకట్రామ్‌రెడ్డి చెప్పారు. అధికార యంత్రాంగమంతా సమిష్టిగా పని చేసి జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడుతామన్నారు. ప్రభుత్వ భూ ములు ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటామని, ఒకవేళ ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమిస్తే, వారిపై పీడీ యాక్టు కేసు పెట్టి, ఆ క్రమణలను తొలగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, అన్ని గ్రామాల్లో మరింత వే గంగా నిర్మాణాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తయిన ఇండ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామన్నారు.

వెంకట్రామ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సిద్దిపేట నూతన కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డి బు ధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టర్‌కు డీఆర్‌వో చంద్రశేఖర్, డీఎఫ్‌వో శ్రీధర్‌తో పాటు జిల్లాఅధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు, కొమురవెల్లి అర్చకులు వేద మంత్రాలతో దీవించారు. కలెక్టర్‌కు డీఆర్‌వో చంద్రశేఖర్, డీఎఫ్‌వో శ్రీధర్, డీపీవో సురేశ్‌బాబుతో పాటు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛా లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...