ప్రైవేట్ బడులు వద్దు..సర్కార్ బడి ముద్దు


Tue,June 11, 2019 11:32 PM

మిరుదొడ్డి : దేశంలోని ఎంతోమంది మేధావులు అందరూ స ర్కార్ బడుల్లోనే విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకొని నేడు ప్రజలకు సేవ చేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లోని పోషకులు తమ పిల్లలను సర్కార్ బడులకు పంపించాలని జిల్లా విద్యాధికారి రవికాంతారావు అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా మన ఊరు-మన బడి అనే నినాదంతో ప్రాథమిక పాఠశాలను, ఎస్సీ కాలనీలోని ఏకోపాధ్యాయ పాఠశాలలను గ్రామస్తులు తీర్మానం మేరకు రెండింటిని జడ్పీటీసీ పాఠశాల ఆవరణలో ఒకే దగ్గర కలిపి 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియలో ఏర్పాటు చేస్తున్నామని డీఈవో తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో ఏక గ్రీవ తీ ర్మానంపై గ్రామస్తులు అభిప్రాయాలను చెప్పమని కోరగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రైవేట్ బడుల్లో మా పిల్లలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు ఉపాధ్యాయుల సంరక్షణలోనే ఉండాలన్నారు. అదే తరహాలో సర్కార్ బడిలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మా పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తేనే మేము మా పిల్లలను సర్కార్ బడికి పంపిస్తామని తెలిపా రు.

వెంటనే స్పందించిన డీఈవో రోజుకో ఉపాధ్యాయుడు వంతుల వారీగా విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించడంతో ఉపాధ్యాయులు స్వచ్ఛందగా అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచాలనే లక్ష్యంతోనే ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం తరఫున ఒక విద్యా వలంటీర్‌ను నియమిస్తున్నామని, గ్రామస్తులు అందరూ కలిసి మరో విద్యా వలంటీర్‌ను నియమించుకోవాలని సూచించారు. కొం డాపూర్ గ్రామం నుంచి ప్రైవేట్ బడులకు పిల్లలను పంపించమని గ్రామస్తులు సమిష్టిగా తీర్మానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి జిల్లా విద్యాశాఖ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ఎంఈవో జోగు ప్రభుదాస్, ప్రాథమిక, జడ్పీ పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...