స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం


Tue,June 11, 2019 11:32 PM

కొమురవెల్లి : గురువన్నపేటను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకు ందామని సర్పంచ్ వైనాల నిర్మల అన్నారు. మంగళవారం మ ండలంలోని గురువన్నపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త సేకరణకు సర్పంచ్ నిర్మల చెత్త బుట్టలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువన్నపేటను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటించాలన్నారు. తడి, పొడి చెత్తను గ్రామపంచాయతీ అం దజేసిన బుట్టల్లో వేరు వేరుగా వేయాలన్నారు. పతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 14వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను అందజేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ అందజేసిన చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో పం చాయతీ కార్యదర్శి ఎన్.రఘు, కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అలీ, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ బచ్చల సాయిమల్లు, ఉపసర్పంచ్ తుక్కోజి నర్సింహులు, వార్డు సభ్యులు బచ్చల సిద్ధులు, బచ్చల కనక మ్మ, బుడిగె రమేశ్, వెంకటలక్ష్మి, పుష్ప, నవనీ త, రాణి, కారోబార్ పర్శరాములు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రసూలాబాద్‌లో గ్రామసభ
మండలంలోని రసూలాబాద్‌లో మంగళవారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని తీర్మానంతో పాటు ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవాలని తీర్మానం చేశారు. అదే విధంగా వంద సంవత్సరాల క్రితం భూదాన్ కింద ఇనామ్ భూములు తమ పేరు మీద రావడం లేదని గ్రామస్తులు గ్రామసభలో విన్నవించగా ఈ విషయమై కలెక్టర్‌ను కలువనున్నట్లు సర్పంచ్ స్వామిగౌడ్ తెలిపారు. అదే విధంగా అక్రమ లే అవుట్ల దారులకు నోటిసులు జారీ చేయడంతో పాటు గ్రామాభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్, ఉపసర్పంచ్ సురేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...