చివరిదశకు పరిహారం పంపి


Tue,June 11, 2019 11:31 PM

తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు మంపు గ్రామాల్లో ఇళ్లు, ఇంటి స్థలాల పరిహారంతో పాటు మిగిలిపోయిన ఆర్‌ఆండ్‌ఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా సాగుతుంది. త్వరలో పరిహారం పంపిణీ కార్యక్రమం పూర్తి చేసే యోచనలో అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి ముంపు బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం మండలంలోని వేములఘాట్‌లో హుస్నాబాద్ ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో తాసిల్దార్‌లు మల్లేశం, హరిబాబు, మాలతి, రమేశ్‌ల ఆధ్వర్యంలో, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో సిరిసిల్లా ఆర్డీవో శ్రీనివాస్‌రావు, దుబ్బాక, చేర్యాల, చందుర్తి, వేములవాడ రూరల్ తాసిల్దార్‌లు అన్వర్, నాగరాజు, నరేశ్, మునీందర్, ఉప తాసిల్దార్ జయంత్ ఆధ్వర్యంలో, లకా్ష్మపూర్‌లో మల్కాజ్‌గిరి ఆర్డీవో మధుసూదన్, సిద్దిపేట రూరల్, మిర్‌దొడ్డి తహసిల్దార్‌లు రమేశ్, పద్మారావు, వీర్‌సింగ్‌ల ఆధ్వర్యంలో, పల్లెపహాడ్‌లో హైదరాబాద్ ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురికి చెక్కులు పంపిణీ చేశారు. మరో వైపు బాధితుల పిర్యాదుల మేరకు ఖాలీ స్థలంకు సంబంధించిన విచారణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...