అభివృద్ధికి ఫిదా


Mon,June 10, 2019 11:41 PM

-గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి జై కొట్టిన ఓటర్లు
-సీఎం ఇలాకాలో గెలుపు ఏకపక్షం
-శాసనసభ, సర్పంచ్, పార్లమెంటు, పరిషత్ ఎన్నికల్లో తేటతెల్లం
-ఆరు జడ్పీటీసీలు, ఎంపీపీలు గులాబీ ఖాతాలోకే..
-సోదిలో లేని కాంగ్రెస్, ఇతర పార్టీలు
గజ్వేల్, నమస్తే తెలంగాణ: గజ్వేల్ నియోజకవర్గం గులాబీ తోటగా మారింది. అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ అధిక్యతను పొంది ఏకపక్షంగా నిలిచింది. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజాలను మెప్పించగా, హరీశ్‌రావు నేతృత్వంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సారధ్యంలో ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్‌ను సంతృప్తి పరిచేవిధంగా రావడం గమనార్హం. శాసనసభ, పార్లమెంట్, పరిషత్ ఎన్నికల్లో గజ్వేల్ ప్రత్యేకతను చాటుకుంది. నాయకులు కార్యకర్తలు పదవుల కోసం పోటీ పడినా పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. గత మూడు ఎన్నికల్లో నియోజకవర్గానికి ఎంపీకొత్త ప్రభాకర్‌రెడ్డి కీలకం కావడం గమనార్హం.
గజ్వేల్ రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి నాయకులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడమే కాకుండా ప్రజల తీర్పు రాష్ట్ర రాజకీయలకు అద్దం పడుతున్నది. ఇది ఎన్నోసార్లు రుజువుకావడమే కాకుండా ఈసారి కూడా అక్షరాల సత్యం అని స్పష్టం అయింది. శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కు భారీ మెజార్టీ ప్రజలు అందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీని గజ్వేల్ ఓటర్లు అందించారు. పరిషత్ ఎన్నికల్లో 6జడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. దీంతో స్థానిక సంస్థలతో పాటు అన్ని పదవులు టీఆర్‌ఎస్‌కుప్రజలు అందించారు.

కొత్త కీలకమయ్యారు..
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గజ్వేల్ అభివృద్దితో పాటు పార్టీ వ్యవహరాల్లో కీలకమయ్యారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధితో పాటు రాజకీయ, ప్రజా అవసరాలన్నీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి అప్పగించగా, హరీశ్‌రావు ఉమ్మడి జిల్లాకు ఇన్‌చార్జి కావడం వల్ల ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గజ్వేల్‌పై ఎక్కవ దృష్టి పెట్టారు. గత శాసన సభ, పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీ గజ్వేల్‌లో ఉండి నాయకులు, కార్యకర్తలను సమన్వయం పరిచారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో కీలకమయ్యారు. పదవుల కోసం కార్యకర్తలు, నాయకుల మధ్య పోటీ పరమైన సమస్యల పరిష్కారంలో హరీశ్‌రావు సూచనలతో తగిన నిర్ణయాలు తీసుకుని గజ్వేల్‌లో గులాబీ వనాన్ని విస్తృత పరిచారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఫారాలు ఇవ్వడం జరిగింది. ఆరుకు ఆరు జడ్పీటీసీలు గెలుపొందగా, అన్ని ఎంపీపీ స్థానాలు కూడా పార్టీ పరమయ్యాయి.

తన కోసం ఇతరులపై భారం..
అన్ని ఎన్నికల్లో గజ్వేల్‌లో తానే కీలకమైన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన ఎన్నికలో మాత్రం గజ్వేల్ బాధ్యతలు స్థానికులకే అప్పగించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మెదక్ పార్లమెంట్ పరిధిలో మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం కోసం కొత్త ఎక్కవ సమయాన్ని కేటాయించారు. గజ్వేల్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తనకు పరిచయం కాబట్టి తనను దీవిస్తారన్న నమ్మకంతో ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఆయన ఆలోచనను గజ్వేల్ ప్రజలు అక్షరాల నిజం చేస్తూ కొత్త ప్రభాకర్‌డ్డికి రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీని అందించారు. దీని పై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పందిస్తూ తాను గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, వారి సేవలో మరింత కీలకం అవుతానని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటు పని చేసే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దీవించడంలో గజ్వేల్ ప్రజలు ఆదర్శంగా నిలిచారు. స్థానిక ప్రజలు చైతన్యవంతులు అని తమ గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నారు. గజ్వేల్‌కు సేవ చేయాడానికి సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చినందుకు ఎంపీకొత్త ప్రభాకర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.


గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ ఏకపక్షం : ఎంపీ కేపీఆర్
సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు అందించిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి ఆశీర్వదించారు. అన్ని ఎన్నికల్లో ఆఖండ విజయాన్ని అందించారు. నాయకులు, కార్యకర్తలు మంచి సహకారం అందించడం వల్ల అభివృద్ధితోపాటు ఎన్నికల్లో సత్ఫలితాలు పొందడం జరిగింది. ఇంకా గజ్వేల్‌ను అనేక రంగాల్లో అదర్శంగా నిలుపాలని కేసీఆర్ భావిస్తున్నారు. దానికి స్థానికులందరి సహకారం ఉంటుంది. కాగా, తనవంతు సేవలందించడానికి సిద్ధంగా ఉంటాను.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...