సర్కార్ బడుల్లోనే మెరుగైన విద్య


Mon,June 10, 2019 11:41 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: సర్కారు బడుల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నదని దుబ్బాక ఎంఈవో ప్రభుదాసు అన్నారు. సోమవారం దుబ్బాక మండలంలో చౌదర్‌పల్లి, ఎనగుర్తి, చీకోడ్, చిన్ననిజాంపేట,ఆకారం, దుంపలపల్లి, దర్మాజీపేట, పెద్దగుండవెళ్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటా సర్వే చేపట్టి బడీడు పిల్లలను గుర్తించారు. ప్రైవేటు బడుల కంటే సర్కారు బడుల్లోనే గుణాత్మక విద్యతో పాటు ఉచితంగా భోజనం, దుస్తులు, పాఠ్యపుస్తకాలతో పాటు మౌలిక వసతులుంటాయని తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ... సర్కారు బడుల్లో గుణాత్మక విత్యతో పాటు విద్యార్థులకు క్రీడలు, సాంకేతిక విద్య వసతులుంటాయన్నారు. ప్రైవేటు బడులకంటే సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ఇందుకు పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించాలని సూచించారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం
రాయపోల్: దౌల్తాబాద్ మండల కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సోమవారం అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వార అందించే పౌష్ఠికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పప్పు దినుసులు, కూరగాయల్లోనే పౌష్ఠికాహారం ఉంటుందని వీటిని ప్రతీ రోజు తీసుకుంటే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవడం వల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రమాదేవి, ప్రతిభ, సులోచన, గిరిజ, అశవర్కర్లు బాలామణి తదితరులు పాల్గొన్నారు.

మిరుదొడ్డి: ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపి వారికి నాణ్యమైన విద్య అందే విధంగా కృషి చేయాలని చెప్యాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లోకేశ్ అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల పరిధిలోని చెప్యాల గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడుల్లో బీపీటీ బియ్యంతో విద్యార్థులకు పౌష్టికాహార భోజనం, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను ఉచితంగానే సరఫరా చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్ర శేఖర శర్మ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...