ప్రజావాణికి 86 దరఖాస్తులు


Mon,June 10, 2019 11:40 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉన్నందున కొద్ది రోజుల నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించలేదని, కోడ్ ముగియడంతో సోమవారం ప్రజావాణి నిర్వహించగా ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు ఎక్కువ సంఖ్యలో వచ్చారన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఆయా శాఖల వారీగా అందజేసి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజావాణికి దాదాపు 86 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...