సర్కారు బడిలోకి పుస్తకాలొచ్చాయి...


Sat,May 25, 2019 11:43 PM

-82 పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు
-పంపిణీలో విద్యాశాఖ అధికారులు
-తుపతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, దుస్తులు
దుబ్బాక, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరికీ విద్యావకాశం కల్పించేందుకు సర్కారు బడులను బలోపేతం చేస్తున్నారు. సర్కారు బడుల్లోనే గుణ్మాతక విద్యతో పాటు రుచికరమైన భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించి విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యార్థులకు విద్యనందిస్తుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ విద్యకే మొగ్గు చూపుతున్నారు. ఇంతకు ముందు (సమైక్యాంధ్రాలో) ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు ఉండటంతో గ్రామీణ, పల్లె ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించేందుకు ఆసక్తి చూపారు. దీంతో వేల రూపాయలు ఫీజులు, పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసి ఆర్థిక, తదితర ఇబ్బందులు ఎదర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారులో ప్రభుత్వ పాఠశాలలు మరింతగా బలోపేతమైయ్యాయి. ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ఎన్నో వసతులు కల్పించడంతో గ్రామీణ ప్రజలు తమ పిల్లలను సర్కారు బడిలోనే చదివించేందుకు ఆసక్తి కనబరుచుతున్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనం అందిస్తుంది. వీటితో పాటు ప్రతి విద్యార్థికి సంవత్సరం రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నారు. విద్యా, క్రీడలు, సాంకేతక విద్యతో పాటు సంస్కృతిక కార్యక్రమాలలో ప్రభుత్వ విద్యార్థులు ముందంజలో నిలుస్తున్నారు. ఈ యేడు పదవ తరగతిలో ఉత్తీర్ణతశాతం మరింతగా పెరగటంతో తమ పిల్లలను సర్కారు బడిలో చదివించేందుకు గ్రామీణులు ప్రత్యేక ఆసక్తి కనబరుచుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉ్తతమ ఫలితాలు రావటంతో ఈ యేడు విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తుగానే పాఠ్యపుస్తకాలు...
జూన్12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కావటంతో సర్కారు బడులకు ముందస్తుగానే పాఠ్యపుస్తాకలను సరాఫరా చేస్తున్నారు. దుబ్బాక మండలంలో మొత్తం 82 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 45 ప్రాథమిక, 12 ప్రాథమికోన్నత, 18 ఉన్నత, 3 గురుకులాలు. ఒక టీఎస్‌డబ్ల్యూర్‌ఎస్, కేజీవీబీ, మైనార్టీ పాఠశాలాలున్నాయి. మొత్తం 82 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ యేడు (2019-20 విద్యా సంవత్సరంలో) ప్రభుత్వ పాఠశాలలో 7,865 మంది విద్యార్థులకు గాను 51,865 తొలి విడుతలో పాఠ్యపుస్తకాలు వచ్చాయి. వీటిని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు అందజేశారు. మరో 3,568 పాఠ్యపుస్తకాలు త్వరలోనే రానున్నాయి. ఈ పాఠ్యపుస్తకాలను మొదట ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేశారు. మండలంలోని 18 ఉన్నత, 3 గురుకుల, సాంఘికసంక్షేమ, కస్తూర్బా, మైనార్టీ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలతో పాటు రెండు జతల దుస్తులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. పాఠశాలలు ప్రారంభంతోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ కార్యక్రమం విధిగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంఈవో ప్రభుదాసు తెలిపారు.

ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవు
-ఎంఈవో, ప్రభుదాసు
ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు రుచికరమైన భోజనంతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నాం. విద్యార్థులను విజ్ఞానవంతలుగా తీర్చిదిద్దేందుకు సర్కారు బడుల్లోనే అన్ని వసతులు కల్పిస్తుంది. పాఠ్యపుస్తకాలను ప్రైవేటుగా విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. దుబ్బాక మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతన్న ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అందజేస్తాం. విద్యార్థులకు ఏ ఒక్క పాఠ్య పుస్తకం కొరత లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బుక్ డిపోలలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలు లభిస్తే ఆ దుకాణ యాజమానులపై చట్టపరమైన చర్యలుంటాయి.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...