వీరన్నపేటలో అంగడి ప్రారంభం


Sat,May 25, 2019 11:43 PM

చేర్యాల: మండలంలోని వీరన్నపేటలో నూతనంగా ఏర్పాటుచేసిన అంగడి (వారంతపు సంత) ను శనివారం గ్రామ సర్పంచ్ కొండపాక భిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యార్థం గ్రామంలో అంగడిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామం తోపాటు సమీప గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలతో పాటు నిత్యవసర వస్తువులను అంగడిలో క్రయ, విక్రయాలు జరుపుకునే వీలుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గౌండ్ల వెంకటేశం, వార్డు సభ్యులు కావ్య, కృష్ణమూర్తి, కవిత, లలిత, కరుణాకర్, కవిత, శ్రీనివాస్, లక్ష్మి, బాబు, పంచాయతీ కార్యదర్శి సుమన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...