పేదింటి వధువుకు ఆర్థిక సాయం


Sat,May 25, 2019 11:42 PM

మద్దూరు: మండలంలోని లద్నూర్‌కు చెందిన పేదింటి వధువు రేణుక వివాహం ఈ నెల 24తేదీన జరుగగా, వధువు తండ్రి సత్యనారాయణ అభ్యర్థన మేరకు వధువుకు శనివారం మండలంలోని సలాఖపూర్ గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీశ్‌కుమార్ రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపడుచుల పెండ్లిలకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృత పర్చనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు కామిడి నర్సింహారెడ్డి, నంగి మైసయ్య, వగలబోయిన బాలరాజుగౌడ్, ఏడాకుల శ్రీనివాస్‌రెడ్డి, గూడ రాజశేఖర్‌రెడ్డి, అభిలాశ్ తదితరులు ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...