జిల్లాను సందర్శించిన హైకోర్టు చీఫ్ జస్టిస్


Sat,May 25, 2019 11:42 PM

సంగారెడ్డి చౌరస్తా: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర ఎస్.చౌహాన్ శనివారం జిల్లా ను సందర్శించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డితో కలిసి సంగారెడ్డికి వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కలెక్టర్ హనుమంతరావుతో పాటు మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ధర్మారెడ్డి, కృష్ణభాస్కర్‌లు స్వాగతం పలికారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో స్వాగతం పలికిన అనంతరం అక్కడి నుంచి నేరుగా జిల్లా కోర్టుకు చేరుకున్నారు. కోర్టు భవనం, కోర్టులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా కోర్టులో కలియ అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తదితరులతో కలిసి వారు సమీక్షించారు. జిల్లా కోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో కోర్టులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్షక, కార్మిక కోర్టుల ఏర్పాటు ఆవశ్యకతపై ఆరా తీశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని పాతభవనం కూల్చివేయాలా లేదా అనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం బైపాస్‌రోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ప్రాంతంలో న్యాయమూర్తుల కోసం నివాస భవనాలపై పరిశీలించినట్లు సమాచారం.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ఎ.హనుమంతరావు, ధర్మారెడ్డి, కృష్ణభాస్కర్, సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, చందనాదీప్తి, జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిల, జిల్లా కోర్టు న్యాయమూర్తులు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, బార్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...