డబుల్ ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే


Sat,May 25, 2019 11:41 PM

దుబ్బాక టౌన్: దుబ్బాకలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. వెయ్యి ఇండ్లను నిర్మిస్తున్నామని ఇప్పటి వరకు చాలా వరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి కలరింగ్ వేస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణంతో పాటు మౌళిక వసతులను కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట తౌడ శ్రీనివాస్, మల్లారెడ్డి, ఆసస్వామి, రొట్టె రమేశ్, బండి రాజు, నరేశ్, దేవుని రాజు తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...