పది, ఇంటర్ విద్యార్థులకు పద్మశాలి పురస్కారాలు


Sat,May 25, 2019 11:41 PM

సిద్దిపేట టౌన్ : జిల్లాలోని పద్మశాలీ విద్యార్థులకు 2019లో ఇంటర్, పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించినవారికి ప్రతిభా పురస్కారాలు అందిస్తామని పద్మశాలీ సమాజం అధ్యక్షుడు కుమ్మరికుంట రమేశ్ అన్నారు. సిద్దిపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్‌లో 95 శాతం, పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. విద్యార్థులు పూర్తి వివరాలు జూన్ 1లోపు ఇంటర్, పదో తరగతి మార్కుల జాబితా, ఫొటో ఆధార్ కార్డులను srcramesh.peddy@gmail.com మెయిల్‌కు పంపాలన్నారు. వివరాలకు 08457 226959 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సమాజం నాయకులు అరగొండ మల్లేశం, అశోక్, ఇప్పకాయల శ్రీహరి, మల్లేశం, మహేశ్, రామచంద్రం పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...