కొమురవెల్లి ప్రజలకు పరిషత్ సేవలు


Sat,May 25, 2019 12:31 AM

-త్వరలో కొలువు దీరనున్న కొత్త ఎంపీపీ
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
కొమురవెల్లి : కొమురవెల్లిలో కొత్తగా మండల పరిషత్ సేవలు అందనున్నాయి. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలతో పాటు కొత్త మండలాలు, గ్రామపంచాయతీ లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన కొమురవెల్లి లో 6 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలు మండల పరిషత్‌లో మొదటిసారి గెలుపొందిన వారిగా రికార్డుల్లో నిలిచిపోనున్నారు.
అన్ని కార్యాలయాలు అందుబాటులో..
2 సంవత్సరాల పాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం కొమురవెల్లి మండలం ఏర్పాటు చేశారు. మండలం ఏర్పడిన తర్వాత పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, వ్యవస్యాయాధికారి కార్యాలయం ఏర్పడినప్పటికీ మండల పరిషత్ సేవల కోసం చేర్యాల పట్టణానికి వెళ్లే పరిస్థితి. దీంతో ఈ మండల ప్రజలకు సమయ పాలన వలన కొంత మేరకు ఇబ్బందులు తలెత్తేవి. ఇక మండల పరిషత్ సేవలు త్వరలో అందుబాటులోకి వస్తుండంతో ఇకా అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొమురవెల్లికి కొత్త పదవులు...
మండలం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలతో కొమురవెల్లికి కొత్తగా ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు రానున్నాయి. 6 ఎంపీటీసీలు ఉన్న కొమురవెల్లి ఎంపీపీ ఎస్సీ మహిళ, జడ్పీటీసీ ఎస్సీ జనరల్‌గా రిజర్వు అయ్యింది. దీంతో మండలంలోని 6 ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ రెండు పదవులు కూడా టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయని మండల వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతున్నది.
ఎంపీడీవో కార్యాలయం కోసం పరిశీలన...
కొమురవెల్లిలో తాత్కాలిక మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు కొరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు మండలంలో పలు భవనాలను ఇప్పటికే పరిశీలించారు. జూన్ 7వ తేదీన మండల పరిషత్ సేవలు అందుబాటులోకి రానుండడంతో అధికారులు త్వరితగతిన మండల పరిషత్ కార్యాలయానికి భవనం ఎంపిక చేసి సామగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...