ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి


Sat,May 25, 2019 12:30 AM

మెదక్ నమస్తేతెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లను సిద్ధం చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, తెలంగాణ గురుకుల పాఠవాలలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు. లెక్కింపు కేంద్రానికి వచ్చే ఏజెం ట్లు, సిబ్బందికి అవసరమయ్యే ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేట్లు చూసుకోవాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఫుటేజిని ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి హాలు వద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందన్నందున వారి సంఖ్యలో దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్, ఎంపీడీవో రాంబాబు, రాణితో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...