హనుమాన్ దీక్ష పూర్వజన్మ సుకృతం


Wed,May 22, 2019 11:34 PM

సిద్దిపేట టౌన్ : హనుమాన్ కృపతో సిద్దిపేట ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామిజీ అన్నారు. సిద్దిపేటలో బుధవారం జరిగే తెప్పోత్సవంలో భాగంగా ఆయన సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా రామరాజు రావిచెట్టు హనుమాన్ ట్రస్టు భవనంలో బుధవారం ఆయన మాట్లాడారు. నేటి యువత వ్యసనాలకు బానిస అవుతుందని, ఎంతో మంది మానసిక, కుటుంబ అశాంతికి లోనవుతున్నారని, వారిని సన్మార్గం లో నడిపేందుకు హనుమాన్ దీక్ష దోహదపడుతుందన్నారు. వంద మందితో దీక్ష ప్రారంభమై నేడు లక్షల సంఖ్యకు చేరుకోవడం గొప్ప విషయమన్నారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన ఎంతో మంది చెడు వ్యసనాలు వదిలి సన్మార్గంలో నడుస్తున్నారని స్వామిజీ వివరిం చారు. సిద్దిపేట రావిచెట్టు హనుమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారుల స్వాములకు నిత్యాన్నదానం చేయడం గొప్పకార్యమని చెప్పారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు లాంటి గొప్ప నాయకుడు ఈ ప్రాంతంలో ఉండడం మన అదృష్టమన్నారు. సిద్దిపేటలో రామరాజు హనుమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో తెప్పోత్సవాలను రెండేండ్లుగా నుంచి దిగ్విజయంగా జరుపుతున్నారని తెలిపారు. 3వ సారి ఎమ్మె ల్యే హరీశ్‌రావు సమక్షంలో తెప్పోత్సవం నిర్వహించడం సంతోషకరమని స్వామిజీ చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మించడంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు పోషిస్తున్న పాత్ర కీలకమన్నారు.

శోభాయాత్రలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలను పురవీధుల గుండా తీసుకెళ్లి మినీ ట్యాంకుబండ్ కోమటి చెరువులో తెప్పోత్సవం జరిగిందన్నారు. తెప్పోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. హనుమాన్ దీక్ష తీసుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. హనుమాన్ మంత్రం, శ్రీరామదూతాయ నమః పఠిస్తారో వారికి కష్టాలు దరిచేరవని చెప్పారు. తెప్పోత్సవంలో పాల్గొన్న భక్తుల సకల పాపాలు తొలగి సర్వసిద్ధులు వస్తాయన్నారు. సమావేశంలో ప్రధాన అర్చకుడు కృష్ణామాచార్యులు, రావి చెట్టు హనుమాన్ ట్రస్టు సభ్యులు నేతి కైలాసం, శ్రీనివాస్ పాల్గొన్నారు.

హనుమాన్ జయంతి సందర్భంగా
29న గుర్రాలగొందిలో అష్టావధానం
చిన్నకోడూరు : హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈ నెల 29న నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలోని అభయాంజనేయస్వామి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, 10 గంటలకు అవధాని బండికాడి అంజయ్యగౌడ్ గారి అష్టావధానం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ కవి ఉండ్రాల రాజేశం తెలిపారు.
బండికాడి అంజయ్యగౌడ్ అవధానంలో గుర్రాలగొందికి చెందిన కవుల పుస్తకాల పరిచయం, సాహి త్య కార్యక్రమం, పద్యాల పఠనాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యుడు కొమురవెల్లి అంజయ్య, కథాశిల్పి అయిత చంద్రయ్య, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎన్నవెల్లి రాజమౌళి పాల్గొంటారని ఆయన తెలిపారు. సమావేశంలో మాజీ సర్పం చ్ లచ్చయ్య, ఆలయ కమిటీ సభ్యుడు తిరుపతి, నాయకులు ఆకుల శ్రీనివాస్, హరిదాస్, వాజుపేయి, విజయేందర్‌రెడ్డి, సతీశ్‌కుమార్, సుమేశ్‌కుమార్, నర్సింహారెడ్డి, ఎల్లయ్య, బాబు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...