మైనార్టీల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం


Wed,May 22, 2019 11:33 PM

అందోల్, నమస్తే తెలంగాణ : ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అందో లు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం జోగిపేటలోని తహసీల్ధార్ కార్యాలయ సమీపంలోని మసీదు వద్ద ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హాజరై ఉపవాస దీక్షలను చేపడుతున్న ముస్లింలకు పండ్లు తినిపించి, ఉపవాస దీక్షలను విరమింప జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేని విధంగా ముస్లింల సంక్షే మం కోసం టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది నిరుపేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్‌లను అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మైనార్టీలను విద్య రంగంలో ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యనందిస్తున్నారన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యనందించేందుకు రుణాలను సబ్సిడీపై అందిస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు అన్ని విధాలుగా సరైన న్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ తస్కీన్ మైనొద్దీన్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మాజీ ఎంపీపీ హెచ్. రామాగౌడ్, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పడిగె సత్యం, పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, మైనార్టీ అధ్యక్షుడు ఖాజాపాషా, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ. అర్ఫత్, నాయకులు అనిల్‌రాజ్, రాజు, గొరే, లాయక్, ఇమ్రాన్, ఎండీ. ఫైజల్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...