ప్రాజెక్టుల పునరావాసం చరిత్రలో మైలురాయి


Wed,May 22, 2019 11:32 PM

తొగుట: ప్రాజెక్టులో భూమి కోల్పోతే రైతులు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరగాలి. ప్రభుత్వం అధికారులు స్పందించకపోతే కోర్టు చుట్టూ తిరగాలి. ఇదంతా గతం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొలువుతీరిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక సీన్ రివర్స్ అయింది. భూ నిర్వాసితుల త్యాగాలకు వెలకట్టలేమని, వారికి మేలైన పరిహారం అందించడంతో పాటు కడుపులో పెట్టుకొని చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో... కార్యాలయాల చుట్టూ అధికారుల వద్దకు ప్రజలు తిరిగే చరిత్ర తారు మారైంది. సార్ మీకు చెక్కు వచ్చింది... మీ గ్రామంలోనే ఉన్నాం.. చెక్కు తీసుకెళ్లండని ఫోన్ ద్వారా సమాచారం అందించడం, తర్వాత అధికారులే ఇంటింటికీ వెళ్లి చెక్కులు ఇచ్చి సంతోషంతో వెనుతిరుగుతున్నారు. అధికారులే ఇంటికి వచ్చి చెక్కులు, పట్టా సర్టిఫిక్కెట్‌లు ఇవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. కొద్ది రోజులుగా నిర్విరామంగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ప్యాకేజీతో పాటు 18 ఏళ్లు నిండిన వారికి చెక్కులతో పాటు ఇంటి పట్టాస్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన అధికారులు ఇండ్లు, ఇంటి స్థలాల పరిహారం పంపిణీపై దృష్టి పెట్టారు. హైకోర్టు సైతం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు పచ్చజెండా ఊపడంతో అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ప్యాకేజీ పరిహారం, 18 ఏండ్లు నిండిన వారికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేస్తూనే మరోవైపు అధికారులు వేగవంతంగా ఇండ్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత మంగళవారం రాంపూర్‌లో మొదటి విడుత ఇండ్లు, ఆస్తులకు సంబంధించి 74 కుటుంబాలకు అధికారులు పరిహారం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మండలంలోని పల్లెపహాడ్‌లో 67 మందికి గానూ 40, లకా్ష్మపూర్‌లో 26 మందికి గానూ 12 మందికి, రాంపూర్‌లో 30/30 మందికి ఇంటింటికి వెల్లి చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటికే ఏటిగడ్డ కిష్టాపూర్‌లో కోర్టుకు వెల్లిన 93 మందికి గానూ 93 మందికి పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఈవో రవికాంతారావు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి రామలక్ష్మి, మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకయ్య, జిల్లా సహకారం సంఘం అధికారి మనోజ్ కుమార్, తాహసీల్దార్‌లు వీర్‌సింగ్, వాణిరెడ్డి, పద్మారావు, మద్దూరు ఎంఈవో నర్సింహారెడ్డిలతో పాటు వివిధ శాఖల అధికారులు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ముట్రాజ్‌పల్లిలో డబుల్ ఇండ్లు పూర్తయిన తర్వాతే ముంపు గ్రామాల ప్రజలకు ఇంటి తాళం చెవులు ఇచ్చ గ్రామాలను ఖాళీ చేయిస్తామని రాజన్న సిరిసిల్లా, సిద్దిపేట కలెక్టర్‌లు కృష్ణ భాస్కర్, వెంకట్రామిరెడ్డి హామీ ఇవ్వడంతో ముంపు బాధితులకు భరోసా ఇచ్చినైట్లెంది. కాగా లకా్ష్మపూర్‌లో పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని అందరికి పరిహారం అందించాలని సర్పంచ్ కొల్చెల్మ స్వామి ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి రవికాంత్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...