శరవేగంగా డబుల్ నిర్మాణాలు


Wed,May 22, 2019 01:57 AM

-దుబ్బాక నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు మంజూరు
-వివిధ దశల్లో 3600 ఇండ్ల నిర్మాణాలు
-రాజకీయాలకతీతంగా ఇండ్ల కేటాయింపు
-ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వెల్లడి

దుబ్బాక టౌన్ : రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ముం దుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక బీసీ కాలనీలో నిర్మిస్తున్న వెయ్యి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణా లు, మల్లాయిపల్లి రోడ్డులో హమాలీ కార్మికుల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుబ్బాకలో సుమారు 50 కోట్ల నిధులతో పలు రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దుబ్బాకకు అందించిన నిధులు నయాపైసా వృథా కాకుండా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే తన లక్ష్యమన్నారు. అభివృ ద్ధి కార్యక్రమాలు రాజకీయాలు, వ్యక్తులకు అతీతంగా నాణ్యతా ప్రమాణాల కు అనుగుణంగా జరుగుతున్నాయన్నారు. ఎక్కడా లేని విధంగా ఇండ్లు లేని నిరుపేదలకు వెయ్యి డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నా రు.

వాటితో పాటు హమాలీ కార్మికులకు ప్రత్యేక కాలనీగా డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. ని యోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. ప్రస్తుతం దుబ్బాక పట్టణంలో 15 బ్లాక్‌లో వెయ్యి ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, నియోజకవర్గం మొత్తంలో సుమారు 4 వేలకు పైగా డబుల్ ఇండ్లు మంజూరు కాగా 3,046 ఇండ్లు నిర్మా ణ దశల్లో ఉన్నాయన్నారు.

బీసీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన..
మండలంలోని హబ్షీపూర్ శివారులో మినీ స్టేడియం గదుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు పనులను జిల్లా బీసీ సంక్షేమాధికారి సరోజనితో కలిసి మంగళవారం ఎమ్మెల్యే సోలిపేట పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నూతనంగా నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందన్నారు. హబ్షీపూర్‌లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మినీ స్టేడియం భవన గదులను తరగతి గదులుగాను, హస్టల్‌గాను వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ...
దుబ్బాకలో ఇటీవల మృతి చెందిన జగ్గారి రాజు కుటుంబా న్ని ఎమ్మెల్యే సోలిపేట పరామర్శించారు. కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ అబ్బుల రాజలింగంగౌడ్, రైతు సమన్వ య సమితి కో-కన్వీనర్ వంగ బాల్‌రెడ్డి, నాయకులు ఆస స్వామి, రొట్టె రమేశ్, నగరం రవి, మల్లేశంగౌడ్, పడాల నరేశ్ తదితరులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...